Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళికి ఆ విషయంలో హ్యాట్సాఫ్ చెప్పాలి : భానుచందర్

  • 'బాహుబలి' పై స్పందించిన భానుచందర్ 
  • ఇది మోస్ట్ పాప్యులర్ మూవీ మాత్రమే 
  • మంచి సినిమా అంటే నా దృష్టిలో 'దంగల్'
తాజాగా ఐ డ్రీమ్స్ తో రాజమౌళి మాట్లాడుతూ ఉండగా .. 'బాహుబలి' సినిమా ప్రస్తావన వచ్చింది. ముందుగా ఆయన ఈ సినిమాను గురించి కామెంట్ చేయడానికి ఇష్టపడలేదు. ఆ తరువాత ఈ సినిమాను గురించి స్పందిస్తూ .. "మంచి సినిమాలు వేరు .. పాప్యులర్ సినిమాలు వేరు" అని అన్నారు.

 'బాహుబలి' హాలీవుడ్ స్థాయి సినిమా అని ఏ హాలీవుడ్ దర్శకుడు అన్నాడు? ఏ హాలీవుడ్ టెక్నీషియన్ అన్నాడు?" అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. 'బాహుబలి' సినిమా గ్రేట్ ఎంటర్టైనర్ .. మోస్ట్ పాప్యులర్ ఫిల్మ్ అని మాత్రమే చెప్పొచ్చు. మంచి సినిమాకి .. పాప్యులర్ సినిమాకి మధ్య తేడా ఉంది. 'బాహుబలి'తో తెలుగు సినిమా ప్రమోషన్స్ రేంజ్ ను రాజమౌళి పై స్థాయికి తీసుకెళ్లారు. ఆ విషయంలో ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నా దృష్టిలో మంచి సినిమా అంటే 'దంగల్' .. మోస్ట్ పాప్యులర్ మూవీ అంటే 'బాహుబలి' అని చెప్పుకొచ్చారు.    
bhanuchandar

More Telugu News